Navaratri Sadhana
ఉదయం గం. 6:30 ని., 24 సార్లు గాయత్రీ మహా మంత్రం పూజ్య గురుదేవులు పండిత శ్రీ రామ శర్మ ఆచార్య పరావాణితో పాటు జపం చేయండి . అనుగ్రహ మాలా మంత్రం మహాలక్ష్మి మంత్రం "నవరాత్రి సాధనా కాలములో చర్మముతో చేసిన వస్తువులు ధరించవద్దు." "దేవీ కవచమును వింటే (ఆచరణలో పెడితే) ఏ శక్తి కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. నవరాత్రులలో నేర్చుకొని మళ్ళీ వచ్చే దేవీ నవరాత్రుల వరకు దానిని ప్రాక్టీస్ చేసుకోవాలి." "దేవీకవచం ప్రకృతిలో ఉన్న అనేక చికాకుల నుండి మీకు రక్షణను ఇస్తుంది. కంప్యూటర్ లో save అనే command ఏ పని చేస్తుందో కవచం అలా పని చేస్తుంది. అంటే మీకు తెలిసి చేసినా తెలియక చేసినా save కమాండ్ నొక్కితే File save అయినట్లు దేవీకవచం చదివితే మీరు రక్షణలోకి వెళ్ళిపోతారు." - Master RK స్వచ్ఛమైన నేతి దీపాన్ని భగవతి చిత్రపటము ఎదురుగా పెట్టి, దేవీకవచ పఠనం చెయ్యడం వలన అన్నిరకాల దురాలోచనలు, మనోరోగాలు నశించిపోతాయి. రోగి స్వయముగా దీనిని పఠించుటలో అసమర్థుడైతే అతని కోసం సంకల్పాన్ని చేసి దేవీకవచ పఠనం చెయ్యడం వలన భగవతి కృప, కరుణ మరియు కటాక్షము పొందవచ్చు. -పండిత శ్రీరామశర్మ ఆచార్య అర్గళా స...